: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం నిండు గర్భణి ప్రాణం తీసింది


విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నూతన్ కల్ మండలం గుండ్లసింగారం గ్రామంలో నిండు గర్భిణి మృతి చెందింది. సింగిల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్ కారణంగా ఆమె మృతి చెందిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సింగిల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్ షాక్ కొడుతోందంటూ గ్రామస్థులు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ స్పందించలేదని వారు విద్యుత్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఆమె ప్రాణానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News