: కూకట్ పల్లి ప్యారడైజ్ హోటల్ కు బాంబు బూచి
హైదరాబాదులోని కూకట్ పల్లి ప్యారడైజ్ హోటల్ లో బాంబు పెట్టారని ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా ముష్కరులు తెగబడే అవకాశముందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజా బెదిరింపుతో కూకట్ పల్లిలో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని మిగిలిన ప్రాంతాల్లో భద్రత పటిష్టం చేశారు.