: వ్యవసాయ రుణాల రుసుం ప్రభుత్వమే ఆర్బీఐకి చెల్లిస్తుంది: హరీష్ రావు
రుణమాఫీకి సంబంధించిన రుసుమును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వ్ బ్యాంక్ కు చెల్లిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం పెట్టుబడి రాయితీ కింద 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని తెలిపారు. కృత్రిమ వర్షాలు కురిపించే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని ఆయన వెల్లడించారు.