: మధ్యాహ్న భోజనం 53 మందిని అనారోగ్యంపాలు చేసింది
మధ్యాహ్న భోజనం 53 మంది పాఠశాల విద్యార్థులను అస్వస్థతకు గురి చేసింది. మధ్యప్రదేశ్లోని సెహొర్ జిల్లా బలాపూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పూర్తయిన తరువాత ఓ ఎన్జీవో సంస్థ బాలబాలికలకు భోజనం ఏర్పాటు చేసింది. స్కూల్ లో భోజనం చేసిన పిల్లలంతా కాసేపటికే అనారోగ్యానికి గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని ఇచ్చావర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. భోజనం సరఫరా చేసిన ఎన్జీవో సంస్థ లైసెన్స్ను రద్దు చేశారు.