: పనామా కాలువకు నేటికి నూరేళ్లు... ఆ విశేషాలు
ప్రపంచ రవాణా చరిత్రలో కీలకమైన మైలురాయిగా భావించే పనామా కాలువ నిర్మాణానికి నేటికి నూరేళ్లు నిండాయి. సరిగ్గా వందేళ్ల క్రితం ఆగస్టు 15న ఈ కాలువను అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ నిర్మించారు. ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొనే పనామా కాలువ నిర్మాణాన్ని ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న పనామా దేశంలో నిర్మించారు. అందుకే దీనికి పనామా కాలువ అనే పేరు వచ్చింది. ఈ కాలువ నిర్మాణంతో అమెరికా పశ్చిమతీరానికి, ఐరోపా తూర్పు తీరానికి ఉన్న వేలాది మైళ్ల దూరం తరిగిపోయింది. ప్రపంచంలోని 160 దేశాలకు చెందిన 1770 నౌకాశ్రయాలకు ఈ కాలువ రవాణా సౌకర్యం కల్పిస్తోంది.