: ఆ రెండూ అరిగిపోయిన డైలాగులు... మోడీకి దమ్ముంది: వెంకయ్యనాయుడు
మతోన్మాదం, సామ్రాజ్యవాదం అనే విమర్శలు అరిగిపోయిన డైలాగులని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మోడీ సంపదను సృష్టించి దేశాన్ని అభివృద్ధి పథాన నడిపించగలరని అన్నారు. పార్లమెంటులో కమ్యూనిస్టుల ఉనికి ఏమైందని ఆయన ప్రశ్నించారు. రైల్వే వ్యవస్థను యూపీఏ నాశనం చేసిందని తెలిపిన ఆయన, బీజేపీ విధానాలే దేశానికి శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.