: నరసాపురంలో జడ్జి, ఎమ్మెల్యే మధ్య వివాదం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కోర్టు ఆవరణ వద్ద అదనపు జడ్జి కల్యాణరావు, టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మధ్య వివాదం చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలో జడ్జి పలు షాపులు ఖాళీచేయిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా, జడ్జిపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని నరసాపురం బార్ అసోసియేషన్ ఆరోపించగా, తాను వివరణ అడగడం తప్పా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తించారని, జడ్జిని ఏకవచనంతో సంబోధించి, దురుసుగా ప్రవర్తించారని బార్ అసోసియేషన్ మండిపడింది. దీనికి నిరసనగా బుధవారం విధులు బహిష్కరించనున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి బాబ్జీ తెలిపారు. కాగా, జడ్జి పట్ల తాను దురుసుగా ప్రవర్తించలేదని, ప్రత్యామ్నాయం చూపకుండా జడ్జి స్వయంగా షాపులు ఖాళీ చేయిస్తే ఎలా? అని ఎమ్మెల్యే మాధవనాయుడు ప్రశ్నించారు. అదీ కాకుండా ఆయనే జడ్జి అన్న విషయం తనకు తెలియదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.