: వికెట్లు... పిట్టల్లా రాలుతున్నాయ్!
ఓవల్ లోనైనా భాగ్యరేఖ మారుతుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పేట్టులేదు. టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయి. ఇంగ్లండ్ తో చివరి టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆండర్సన్, బ్రాడ్ చెరో వికెట్ తో భారత్ పతనానికి నాంది పలికితే... కొత్త పేసర్ క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లతో మరింతగా దెబ్బకొట్టాడు. కోహ్లీ 6 పరుగులు చేయగా, రహానే పరుగులేమీ చేయకుండానే జోర్డాన్ ధాటికి బలయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ విజయ్ (18*), కెప్టెన్ ధోనీ (0*) ఉన్నారు.