: వాజ్ పేయి, మోడీ మధ్య అదే తేడా: అమిత్ షా


బీజేపీ కార్యకర్త ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయడం పార్టీ పరంగా పెద్ద పండగ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గతంలో వాజ్ పేయి ఎర్రకోటపై జాతీయపతాకావిష్కరణ చేసినప్పటికీ, మోడీ జెండా పండుగ విభిన్నమైనదని అన్నారు. ఎన్డీయే కూటమిలో బీజేపీకి నామమాత్రపు మెజారిటీ పొందిన నేపథ్యంలో వాజ్ పేయి జాతీయ జెండా ఎగురవేస్తే, పూర్తి మెజారిటీ సాధించిన నేపథ్యంలో మోడీ జాతీయ పతాకం రెపరెపలాడించారని తెలిపారు. సుదీర్ఘకాలం తరువాత బీజేపీకి మంచి రోజు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News