: త్రివర్ణంతో సందడి చేసిన గూగుల్ డూడుల్


భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ ను హోం పేజ్ లో ఉంచింది. మువ్వన్నెలతో రూపొందించిన డూడుల్ లో భారత ప్రభుత్వం విడుదల చేసిన తొలి స్టాంపును పొందుపరిచారు. ఈ స్టాంపును 1947 నవంబర్ 21న విడుదల చేశారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత మొట్టమొదట విడుదల చేసిన స్టాంపు ఇదే కావడం విశేషం. స్టాంపు పై భాగంలో జైహింద్ నినాదం ఉంది. అప్పట్లో ఈ స్టాంపు ధర మూడున్నర అణాలు. విదేశాలకు పంపే పోస్టేజీలకు దీనిని వినియోగించేవారు.

  • Loading...

More Telugu News