: స్వాతంత్ర్యదినోత్సవం అతడిలో విషాదంనింపి... కుటుంబాన్ని ఆనందంతో ఉప్పొంగేలా చేసింది
ఓ కానిస్టేబుల్ జీవితంలో విషాదం నింపిన స్వాతంత్ర్యదినోత్సవం... పదిహేనేళ్ల తరువాత అతని కుటుంబాన్ని ఆనందంతో ఉప్పొంగేలా చేసింది. వివరాల్లోకెళితే... సరిగ్గా పదిహేనేళ్ల క్రితం సీఐఎస్ఎఫ్ కు చెందిన ఓ కానిస్టేబుల్ ను విధులకు హాజరుకాని కారణంగా ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. రెండు రోజులు సెలవుతీసుకున్న అతను చెప్పిన సమయానికి హాజరుకాకపోవడమే తప్పయింది. విధులలో చేరాల్సిన రోజు స్వాతంత్ర్యదినోత్సవం రోజు కావడమే అతనికి అంత పెద్దశిక్ష పడడానికి కారణం. దీంతో అతను కోర్టుకెక్కాడు. పదిహేనేళ్ల పాటు కేసు విచారించిన ఢిల్లీ హైకోర్టు కానిస్టేబుల్ ను విధుల్లోనుంచి తొలగించడం న్యాయసమ్మతం కాదని తీర్పు ఇచ్చింది. తిరిగి అతడిని విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పదిహేనేళ్ల క్రితం ఏ రోజు అతనికి ఉద్యోగం పోయిందో అదే రోజు మళ్లీ ఉద్యోగం రావడం అతని కుటుంబంలో హర్షం నింపింది.