: జెండా సాక్షిగా కొట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలు


కరీంనగర్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు జాతీయ జెండా సాక్షిగా కొట్టుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడుకి, మహిళా విభాగం నేత సుశీలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. విభేదాల నేపథ్యంలో మాటామాటా పెరగడంతో సుశీల అపరకాళిక అవతారమెత్తారు. చెప్పు తీసుకుని పార్టీ జిల్లా అధ్యక్షుడిపై దాడికి దిగారు. జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమానికి తనకు సమాచారం అందించలేదని సుశీల ఆరోపిస్తున్నారు. కాగా, దాడి సమయంలో మిగతా నాయకులు అడ్డుకునేందుకు యత్నించినా సరే, సుశీల మాత్రం సదరు అధ్యక్షుడికి విజయవంతంగా దేహశుద్ధి చేశారు.

  • Loading...

More Telugu News