: వివేకానందుడి కొటేషన్ తో ప్రసంగం ముగించిన చంద్రబాబు
కర్నూలులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రసంగం ముగిసింది. సుదీర్ఘంగా ఉపన్యసించిన ఆయన చివరగా వివేకానందుడి కొటేషన్ ను గుర్తు చేశారు. "నీలో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొలుపు. దృష్టిని లక్ష్యంపైనే కేంద్రీకరించి ముందుకు సాగిపో, విజయం సిద్ధిస్తుంది" అంటూ చదివి వినిపించారు. అంతకుముందు మహానదులు సైతం చిన్న నీటి చుక్కతో మొదలువుతాయని, మంచి పనులన్నీ ఒక్క అడుగుతో ప్రారంభమవుతాయని, తన పాదయాత్ర ఓ సంకల్పంతో ఆరంభమైందని అన్నారు.