: పోలవరం ప్రాజెక్టుకు 2 వేల కోట్లు కేటాయిస్తాం: బాబు
పోలవరం ప్రాజెక్టు అంశాన్ని చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ నెల 20న వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్ళలో రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తయారుచేస్తామని బాబు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంధ్రుల త్యాగాలు నిరుపమానమని కొనియాడారు. మామ ఎన్టీఆర్ పైనా ప్రశంసలు కురిపించారు.