: మగ పిల్లలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య రోజురోజుకీ తగ్గుతోంది: ఎర్రకోట ప్రసంగంలో మోడీ
మగ, ఆడపిల్లల నిష్పత్తిలో వస్తోన్న తేడా తనను ఆందోళనకు గురిచేస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య రోజురోజుకీ తగ్గుతోందన్నారు. దీని వల్ల సమాజంలో అసమతుల్యత ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఆడశిశువుల భ్రూణ హత్యలకు పాల్పడవద్దని ఆయన డాక్టర్లను కోరారు. అలాగే పుట్టేది ఆడశిశువు అని తెలియగానే ఆబార్షన్ చేయించుకోవద్దని ఆయన తల్లిదండ్రులను వేడుకున్నారు. ఐదుగురు కొడుకులున్న తల్లిదండ్రుల కంటే, ఒక్క కూతురున్న తల్లిదండ్రులు ఎంతో సుఖంగా ఉండటం తాను అనేక చోట్ల చూశానని మోడీ అన్నారు.