: గతంలో స్నేక్ ఛార్మర్స్, చేతబడుల దేశంగా ఇండియాను చూసేవారు: మోడీ
పాములు ఆడించేవారు (స్నేక్ ఛార్మర్స్), చేతబడుల దేశంగా భారతదేశం గురించి ఒకప్పుడు వెటకారంగా పాశ్చాత్యులు చెప్పుకునేవారని మోడీ అన్నారు. కానీ అదే పాశ్చాత్యులు ఇప్పుడు ఐటీ రంగంలో భారతదేశ యువత ప్రతిభను చూసి అశ్చర్యపోతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఐటి రంగం భారతదేశానికి సరికొత్త గుర్తింపు తీసుకువచ్చిందని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలో డిజిటల్ ఇండియాను తాను చూడాలనుకుంటున్నానని మోడీ అన్నారు.