: మరుగుదొడ్లు లేక చాలా చోట్ల పిల్లలు బడి మానేసున్నారు: మోడీ
ఏడాదిలోగా దేశంలోని ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తామని మోడీ వ్యాఖ్యానించారు. మరుగుదొడ్లు లేక చాలా చోట్ల పిల్లలు బడి మానేసున్నారని... ఇది మనం సిగ్గుపడాల్సిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని మారుమూల పల్లెటూరిలోని ప్రతి ఇంటికి, పాఠశాలకు మరుగుదొడ్డిని నిర్మించేందుకు సంసద్ గ్రామ యోజన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్టు మోడీ తెలిపారు. పరిశుద్ధ భారతం కోసం భారతీయులందరూ కృషి చేయాలని మోడీ కోరారు.