: మేడిన్ ఇండియా బ్రాండ్ అంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి: మోడీ
మేడిన్ ఇండియా ముద్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని మోడీ వ్యాఖ్యానించారు. దేశయువత ప్రపంచ యవనికపై సింహగర్జన చేయాలని మోడీ సూచించారు. అభివృద్ధి సమతౌల్యం సాధించాలంటే తయారీ రంగం బలోపేతం కావాలని మోడీ పేర్కొన్నారు. ఎలక్ట్రికల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు... రసాయనాల నుంచి ఔషధాల వరకు 'మేడిన్ ఇండియా బ్రాండ్' ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలవాలని మోడీ అన్నారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ ను ముంచెత్తాలని మోడీ ఆకాంక్షించారు. ఐటీ నిపుణులు భారతదేశ సత్తా ఏంటో... ప్రపంచానికి నిరూపించారని మోడీ వ్యాఖ్యానించారు.