: ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడంలేదు: మోడీ
ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏర్పడ్డ అలసత్వంపై మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని మోడీ విచారం వ్యక్తం చేశారు. చప్ర్రాసీ నుంచి కేబినెట్ సెక్రటరీ వరకు తమ ప్రభుత్వంలో అందరూ ముఖ్యులేనని మోడీ అన్నారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి... ఉద్యోగులు బలవంతాన సమయపాలన పాటించకూడదని... క్రమశిక్షణ పాటించడాన్ని ఉద్యోగులు బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు.