: ఉదయం 7:40 నిమిషాలకి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్న మోడీ
68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా... ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని 10 వేల మంది పారామిలటరీ దళాలు... 5 వేల మంది స్థానిక పోలీసులు ఎర్రకోట చుట్టూ పహారా కాస్తున్నారు. ఎర్రకోటకు మోడీ ఉదయం 7:20 నిమిషాలకు చేరుకోనున్నారు. జాతీయ జెండాను మోడీ 7:40 నిమిషాలకి ఎగురవేస్తారు. ఎర్రకోటకు చేరుకోకముందు... రాజ్ ఘాట్ లోని మహాత్మగాంధీ సమాధికి మోడీ నివాళులు అర్పించనున్నారు. అనంతరం మోడీ ఎర్రకోటకు చేరుకుంటారు.