: కేసీఆర్ కంటే ఔరంగజేబే బెటర్... కేసీఆర్ కు ప్రజలంటే లెక్కలేదు: అద్దంకి దయాకర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరంగజేబు కంటే పెద్ద నియంత అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన ఔరంగజేబు కూడా తన ప్రజలను ప్రేమించాడని... కేసీఆర్ కు ప్రజలంటే లెక్కే లేదని ఆరోపించారు. ఈ రోజు టీఆర్ఎస్ అనుభవిస్తున్న అధికారం... కాంగ్రెస్ వేసిన భిక్ష అని అన్నారు. సమగ్ర సర్వేతో తెలంగాణ ప్రజల జాతీయత, ప్రాంతీయత ఒక్క రోజులో తేల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఆ రోజు ఇంట్లో లేకుంటే తెలంగాణ వారు కానట్టేనా? అని నిలదేశారు. కనీసం రెండు, మూడు రోజుల సమయం కూడా ఇవ్వరా? అని అన్నారు. కేసీఆర్ ది ఫాసిస్టు విధానమని మండిపడ్డారు. తెలంగాణలో ఇంతకు ముందు విధివిధానాలు, నిబంధనలు లేనట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News