: వారిని కలిపి తీరుతాను: లాలూ
బీజేపీకి చెక్ చెప్పేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మయావతి మధ్య మైత్రిని కుదురుస్తానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ కమండల రాజకీయాలను అడ్డుకునేందుకు మండల రాజకీయాలను తెరపైకి తెస్తామని అన్నారు. మత శక్తులను అడ్డుకునేందుకు దేశంలోని కులాలను ఏకం చేస్తామని లాలూ తెలిపారు. ములాయం, మాయావతి కలవడం ఒకట్రెండు రోజుల్లో జరిగే పని కాదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీని ఓడించేందుకు వారిద్దరూ చేతులు కలుపుతారనే నమ్మకం తనకు ఉందని లాలూ తెలిపారు. మోడీ దూకుడుతో గత లోక్ సభ ఎన్నికల్లో 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 71 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.