: ఏపీలో వ్యవసాయ రుణమాఫీ జీవో జారీ


ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రుణాల మాఫీపై ప్రభుత్వం జీవో 174ను జారీ చేసింది. 13 జిల్లాల్లోని వ్యవసాయ రుణగ్రహీతలకు మాఫీ వర్తిస్తుందని జీవోలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర బ్యాంకర్ల సంఘ మార్గదర్శకాల ప్రకారం రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, వ్యవసాయ, సహకార సంఘాలు రుణాలకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. 2014 మార్చి 31లోపు వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయం కోసం తీసుకున్న పంట, బంగారం రుణాలకు కూడా మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల పరిమితి వరకు రుణమాపీ వర్తిస్తుందని ప్రభుత్వం జీవో ద్వారా వెల్లడించింది.

  • Loading...

More Telugu News