: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శ్రే వేంకటేశ్వరుని సర్వదర్శనానికి 16 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో భక్తుల రద్దీ ఆదివారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.