: పొన్నాల, జానాపై హరీష్ రావు రుసరుసలు


ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత జానారెడ్డిపై మంత్రి హరీష్ రావు రుసరుసలాడారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 67 ఏళ్లలో మీరు, మీ పార్టీ చేయలేని దానిని కేవలం 67 రోజుల్లోనే ఎలా చేస్తామని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేయమని బాబు అంటుంటే, ఆయనను అడగడం మానేసిన టీడీపీ నేతలు ఇక్కడ ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రశ్నలు ఎలా వేస్తారని ఆయన నిలదీశారు. గవర్నర్ అధికారాలపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News