: అక్కడ 12 వందల అడుగులు తవ్వినా నీటి జాడ లేదు!


అక్కడ 900 నుంచి 12 వందల అడుగులు తవ్వినా నీటి జాడ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో కరవు ఛాయలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. బోరు బావుల్లో నీరు లేకపోవడంతో ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయి. కడప జిల్లాలోని 35 వేల హెక్టార్లలో ఉన్న మామిడి తోటలు వర్షాలు లేక ఎండిపోతున్నాయి. ఇప్పటికే 10 వేల హెక్టార్లలో ఉన్న మామిడి చెట్లు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాపు దశలో ఉన్న 25 వేల హెక్టార్లలో మామిడి తోటలను కాపాడుకోవడానికి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. కొందరు టాంకర్లతో నీటిని తీసుకువచ్చి చెట్లను తడుపుతున్నారు. ఎండిన చెట్లను వంట చెరుకు కింద రైతులు విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News