: టీమిండియాకు ఓవల్ లో 'పచ్చ'ని స్వాగతం


భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి నుంచి ఓవల్ లో సిరీస్ చివరి టెస్టు జరగనుంది. మనవాళ్ళ కష్టాలకు కంటిన్యుయేషన్ అన్నట్టుగా అక్కడ పచ్చని పిచ్ స్వాగతం పలికింది. పిచ్ కి, మైదానానికి అట్టే తేడాలేదని సమాచారం. అయితే, రేపటి కల్లా పిచ్ పై పచ్చిక ఉంటుందా? అన్నది సందేహాస్పదంగా మారింది. ఎందుకంటే, ఇంగ్లండ్ పార్ట్ టైం స్పిన్నర్ మొయిన్ అలీ విశేషంగా రాణిస్తుండడంతో పిచ్ ను స్పిన్ కు అనుకూలంగా తయారుచేయొచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు టర్నింగ్ ట్రాక్ అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా, పరువు కాపాడుకోవాలంటే ధోనీ సేన ఈ మ్యాచ్ లో నెగ్గడం తప్పనిసరి. ఇప్పటికే ఈ ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-2తో వెనకబడి ఉంది. ఓవల్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. మ్యాచ్ ను ఇంగ్లండ్ కు కోల్పోతే మాత్రం మరో భంగపాటు ఘనతను తలకెత్తుకోకతప్పదు.

  • Loading...

More Telugu News