: హైదరాబాదులో 'పేకాట క్లబ్' అన్న మాట వినపడకూడదు: కేసీఆర్
హైదరాబాదులో పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ట్యాంక్ బండ్పై హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా పోలీస్‌శాఖకు 300 బైక్‌లు, 100 ఇన్నోవాలను పోలీసు శాఖకు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఏర్పడాలని ఆకాంక్షించారు. హైదరాబాదు మొత్తం మూడు నెలల్లో సీసీ కెమెరాలు అమర్చి పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అధునాతన సౌకర్యాలు, అన్ని హంగులతో తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తామని ఆయన చెప్పారు. స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా సర్వీస్ చేయాలని పోలీసులకు కేసీఆర్ హితవు పలికారు.