: సమస్త సమాచారంతో సిద్ధంగా ఉండాలి: చంద్రబాబు
ఈ నెల 18 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ వ్యూహాలపై సమీక్ష నిర్వహించారు. చీఫ్ విప్, విప్ లతో పాటు పయ్యావుల కేశవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు సమస్త సమాచారంతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. ఈ నెల 18న శాసనసభాపక్ష సమావేశం జరపాలని నిర్ణయించారు. ఈ నెల 21న అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.