: నాకు డబ్బు ముఖ్యం కాదు: ప్రియాంక చోప్రా


తనకు డబ్బు ముఖ్యం కాదని, మంచి పని ముఖ్యమని ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అన్నారు. బాక్సర్ మేరీకోం పాత్రలో నటిస్తున్న ప్రియాంకా ఆ సినిమా తాను ఉచితంగానే చేసేదాన్నని అన్నారు. తనకు ప్రతి సినిమా ఒక ‘మొగల్ ఎ అజమ్’ (దిలీప్ కుమార్ నటించిన క్లాసిక్) లాంటిదేనని ఆమె పేర్కొన్నారు. మేరీకోం జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా సెప్టెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రియాంకా మాట్లాడుతూ... ప్రతి చిత్రంలోనూ తాను పోషించే పాత్రకు న్యాయం చేయడానికి ఎంతో కష్టపడతానని చెప్పారు. తనకూ మేరీకోంకు పోలికలున్నాయన్న ఆమె... పెంపకంలోను, వృత్తుల్లో మహిళలుగా జీవితాన్ని ఎదుర్కొన్న తీరులోను పోలికలున్నాయన్నారు.

  • Loading...

More Telugu News