: అతి సర్వత్ర వర్జయేత్... అది ఇక్కడా వర్తిస్తుంది!


ఏదైనా పరిమితంగా చేస్తేనే ఫలితం సానుకూలంగా ఉంటుంది. మితి మీరితే... నష్టదాయకమే. వ్యాయామ కసరత్తులూ అంతేనట. పరిధికి మించిన వ్యాయామం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. లారెన్స్ బర్క్ లీ నేషనల్ ల్యాబొరేటరీ, హార్ట్ ఫోర్డ్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగానికి చెందిన పాల్ థాంప్సన్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టారు. హార్ట్ ఎటాక్ కు గురై కోలుకున్న వారిపై పరిశోధన చేయడం ద్వారా వారు ఈ విషయాలను వెల్లడించారు. అధిక కసరత్తుల ద్వారా కార్డియోవాస్కులార్ ముప్పు ఎక్కువ అవుతుందట. ఇలాంటి వ్యక్తులు పరుగు పందాల్లో పాల్గొనడం ఏమంత క్షేమదాయకం కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News