: బీమా బిల్లు సెలక్ట్ కమిటీకి అప్పగింత
వివాదాస్పదంగా మారిన బీమా బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి అప్పగించింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సభ స్వీకరించడంతో బిల్లును పరిశీలించాలని కమిటీ సభ్యులకు తెలిపారు. వచ్చే సమావేశాల్లో మొదటివారం చివరిరోజున బిల్లుపై కమిటీ ఓ నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, జేడీ(యూ), టీఎంసీ, ఏఐఏడీఎంకే, ఎస్పీ, బీజేపీ, సీపీఐ(ఎం)ఇంకా పలు పార్టీల నేతలు కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటి నుంచి బీమా బిల్లులోని పలు సవరణలపై పార్టీలతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు పలుసార్లు విఫలమయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించింది.