: అక్కడ ముస్లింలను హిందువులనే పిలుస్తారు: గోవా సీఎం
హిందుత్వ అంశంపై గోవా సీఎం మనోహర్ పారికర్ వివరణ ఇచ్చారు. విదేశీయులు భారత్ లో నివసించే వారందరినీ హిందువులుగానే పరిగణిస్తారని అన్నారు. ఇస్లాంను అనుసరించే గల్ఫ్ దేశాల్లోనూ మనదేశానికి చెందిన ముస్లింలను హిందువులనే పిలుస్తారని తెలిపారు. హిందువులంటే భారతీయులన్నది వారి భావన అని పారికర్ వివరించారు. ఏ మతానికి చెందిన వారినైనా విదేశాల్లో హిందువులనే అంటారని చెప్పారు. అసెంబ్లీలో జరిగిన ఓ చర్చ సందర్భంగా గోవా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, పారికర్ వ్యాఖ్యలపై విపక్ష నేత ప్రతాప్ సింగ్ రాణే స్పందిస్తూ, హిందు అనే పదం వేదాల్లోనే లేదని అన్నారు. ఈ సందర్భంగా సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి డిసౌజాకు రాణే చురకలంటించారు. హిందుత్వ అనేది ఎప్పటి నుంచో ఉందని డిప్యూటీ సీఎం భావిస్తున్నట్టుందని రాణే ఎత్తిపొడిచారు. కాగా, ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా ఇంతకుముందోసారి భారత్ ఓ హిందూ దేశమని వ్యాఖ్యానించారు.