: పార్లమెంటుకు హాజరవడం ఎంపీగా బాధ్యత: షబానా అజ్మి


బాలీవుడ్ సీనియర్ నటి రేఖ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రాజ్యసభకు హాజరుకాకపోవడంపై వచ్చిన విమర్శల పట్ల నటి, పార్లమెంటు మాజీ సభ్యురాలు షబానా అజ్మి స్పందించారు. వారిద్దరికీ మద్దతుగా మాట్లాడుతూనే, సభకు రావడం బాధ్యతగా భావించాలని ఆమె హితవు పలికారు. ఇది చాలా సీరియస్ అంశం అని పేర్కొంటూ, సెలబ్రిటీ ఎంపీలు ఎప్పుడూ సభకు గైర్హాజరవుతూనే ఉంటారన్నారు. కానీ, సచిన్, రేఖలపైనే ఎందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఎంపీలుగా దేశానికి వారు ప్రాధాన్యత వహించలేరని భావించినట్టయితే రాజ్యసభ సభ్యత్వానికి అంగీకరించకుండా ఉంటే బాగుండేదని షబానా అభిప్రాయపడ్డారు. ఇదేమీ వారికి పతకాన్ని తీసుకొచ్చేది కాదని, అదొక బాధ్యతని ఆమె పేర్కొన్నారు. సెలబ్రిటీ అయినా వేరొకరైనా పార్లమెంటు సభ్యులన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, బాధ్యతగా భావించి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. సమావేశాలప్పుడు హాజరుకావాలని ఆమె చెప్పారు. ఇదంతా కుదరకపోతే ముందే చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News