: జెట్ ఎయిర్ వేస్ విమానంలో అగ్నిప్రమాద కలకలం
ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్ళాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఈ వేకువజామున అగ్నిప్రమాద కలకలం రేగింది. 70 మంది ప్రయాణికులతో ఈ విమానం టేకాఫ్ కు సిద్ధమైన దశలో ఉన్నట్టుండి ఫైర్ అలారం మోగింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని హ్యాంగర్ కు తరలించి తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి తరలించారు.