: ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తిచేయండి: రాజ్యసభలో కేకే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల విభజనను చట్టప్రకారం త్వరగా పూర్తిచేయాలని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు రాజ్యసభలో కోరారు. ఈ మేరకు ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, కమల్ నాథన్ కమిటీ సిఫార్సు చేసిన 18ఎఫ్ నిబంధన తెలంగాణ ఉద్యోగులకు విరుద్ధంగా ఉందన్నారు. అటు, ఉద్యోగుల విభజన పూర్తికాని నేపథ్యంలో పాలనకు ఆటంకం ఏర్పడుతోందని పేర్కొన్నారు.