: నరైన్ హ్యాట్రిక్.. డంగైపోయిన కింగులు
కోల్ కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ హ్యాట్రిక్ సాధించాడు. మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో నరైన్ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి ఐపీఎల్ తాజా సీజన్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా అవతరించాడు. 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 96 పరుగులతో భారీ స్కోరు దిశగా సాగిపోతున్న పంజాబ్ జట్టును ఆ మరుసటి ఓవర్లో కోలుకోలేని దెబ్బతీశాడీ యువ సంచలనం. ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి మూడు బంతులకు డేవిడ్ హసీ (12), అజర్ మహమూద్ (0), గురుకీరత్ సింగ్ (0) లను పెవిలియన్ చేర్చాడు. నరైన్ మాయాజాలానికి దిమ్మెరపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్తుతం 16 ఓవర్ల అనంతరం 7 వికెట్లు చేజార్చుకుని 109 పరుగులు చేసింది.