: ఏపీ, తెలంగాణల మధ్య ఉద్యోగుల పంపకాలు త్వరలో పూర్తిచేస్తాం: మంత్రి జితేంద్రసింగ్
రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన అంశాన్ని కాంగ్రెస్ నేత జేడీ శీలం లేవనెత్తారు. ఉద్యోగుల విభజన ఎప్పటిలోగా పూర్తిచేస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని... ప్రస్తుతానికి తాత్కాలికంగా కేటాయింపులు చేశామని... త్వరలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగుల విభజనపై సిన్హా కమిటీ నివేదిక తమకు అందిందన్నారు.