: ప్రాక్టీసుకు డుమ్మా కొట్టిన ధోనీ... సచిన్ ను స్ఫూర్తిగా తీసుకున్నాడేమో!


చివరి టెస్టు శుక్రవారం ఆరంభం కానుండగా, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీసుకు డుమ్మా కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే బ్యాటింగ్ వైఫల్యంతో దారుణ పరాభవాలు చవిచూసిన టీమిండియా నెట్ ప్రాక్టీసును సీరియస్ గా తీసుకోవడంలేదన్న విషయం ధోనీ గైర్హాజరీతో స్పష్టమవుతోంది. అటు కెప్టెన్ గా, ఇటు బ్యాట్స్ మన్ గా విఫలమవుతున్న ధోనీ నెట్స్ లో చెమటోడ్చితే కాసింత ఫలితం ఉంటుందన్నది క్రికెట్ పండితుల అభిప్రాయం. ఇంతకుముందు 2003 వరల్డ్ కప్ సందర్భంగా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెట్ ప్రాక్టీసు లేకుండా బరిలో దిగి టన్నుల కొద్దీ పరుగులు సాధించడాన్ని ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్ఫూర్తిగా తీసుకున్నాడేమోనని వారు చమత్కరిస్తున్నారు. కాగా, ధోనీ గైర్హాజరీతో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ ల పర్యవేక్షణలో టీమిండియా ప్రాక్టీసు కొనసాగింది. ఇదిలావుంటే, భారత్ కు ఐదో టెస్టు ముంగిట ఓ శుభవార్త. గాయంతో రెండు మ్యాచ్ లకు దూరమైన ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్ నెస్ సాధించాడు. దీంతో, ఈ పొడగరి స్పీడ్ స్టర్ రేపటి మ్యాచ్ కు బరిలో దిగే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News