: అక్టోబర్ 2 నుంచి ఏపీ పరిపాలన ఏపీ రాజధానిలోనే
అక్టోబర్ రెండో తేదీ నుంచి విజయవాడ సమీపంలోని గన్నవరం నుంచి ఏపీ ప్రభుత్వం పనిచేయడం ఆరంభిస్తుంది. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మేధా టవర్స్ భవనం నుంచి ఏపీ సర్కారు తన విధులను నిర్వర్తించనుంది. ఈ భవనాన్ని అక్టోబర్ 2 నుంచి ఏపీ సచివాలయంగా భావించవచ్చు. మేధా టవర్స్ ను వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఐటీ రంగం కోసం నిర్మించారు. కాని ప్రస్తుతం అక్కడ ఒకట్రెండు కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ భవనంలో మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది. ప్రస్తుతం 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మాత్రమే ఐటీ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. ఇంకా లక్షా 76 వేల చదరపు అడుగుల స్థలం మేధా టవర్స్ లో ఖాళీగా ఉంది. త్వరలో ఏపీ ప్రభుత్వానికి చెందిన 25 శాఖల కార్యాలయాలను హైదరాబాద్ నుంచి ఈ టవర్స్ లోకి మార్చనున్నారు. తొలి విడతలో హెఓడీ కార్యాలయాలను మేధా టవర్స్ కు తరలిస్తారు.