: రైల్వేలో 'ఈ-టికెటింగ్' వ్యవస్థ ప్రారంభించిన మంత్రి సదానంద గౌడ


రైల్వేలో నెక్స్ ట్ జనరేషన్ 'ఈ-టికెటింగ్' వ్యవస్థ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ నిన్న (బుధవారం) దీనిని ప్రారంభించారు. దాంతో నిమిషానికి 7,200 టికెట్లు బుక్ చేసేందుకు ఈ నూతన సాంకేతికత తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ఏకకాలంలో 1.2 లక్షల మంది ఈ-టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. పాత వ్యవస్థతో 40వేల మంది మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వీలుండేది. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేసే క్రమంలో కేంద్ర రైల్వే సమాచార వ్యవస్థ దీనిని తీసుకొచ్చింది. రూ.180 కోట్లతో ఈ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశారు.

  • Loading...

More Telugu News