: ముంబయి ఎయిర్ పోర్టులో హై అలర్ట్
ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ముంబయి ఎయిర్ పోర్టులో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను విడిపించుకునేందుకు తీవ్రవాదులు ఆ రోజు విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ హెచ్చరించింది. అన్ని హెలికాప్టర్లు, విమానాల షెడ్యూల్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, జాగ్రత్త వహించాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి సూచించింది. అంతేగాక, ఎయిర్ పోర్టు సందర్శకుల గ్యాలరీలోకి ఈ నెల 20వ తేదీ వరకు ఎవరినీ రానివ్వకూడదని ఆదేశాలు ఇచ్చింది.