: భారీ జాతీయ జెండాతో హైదరాబాద్ విద్యార్థుల ప్రపంచ రికార్డు
హైదరాబాద్ కు చెందిన లోటస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. 2014 అడుగుల పొడవుతో రూపొందిన మువ్వెన్నల పతాకాన్ని విద్యార్ధులు గురువారం ట్యాంక్ బండ్ పై ప్రదర్శించారు. తద్వారా వారు సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేశారు. ఈ భారీ జాతీయ జెండాను తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఆవిష్కరించారు.