: జడ్జీల బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తా: ఫాలీ నారిమన్


న్యాయమూర్తుల ఎంపిక కోసం కేంద్రం ప్రతిపాదిస్తున్న జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిటీ బిల్లుకు అడుగడుగునా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. విపక్ష పార్టీలను ఎలాగోలా ఒప్పించుకున్న మోడీ సర్కారు బుధవారం ఈ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించేలా చేసింది. గురువారం రాజ్యసభలోనూ ఈ బిల్లుకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకపోవచ్చు. తాజాగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రముఖ న్యాయ కోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు ఫాలీ నారిమన్ గళం విప్పారు. రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసినా, సుప్రీం కోర్టును ఆశ్రయించి ఈ బిల్లును అడ్డుకుంటానని నారిమన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News