: 'తొమ్మిది నెలల గర్భంతో ఉన్నాను, సర్వే చేయలే'నన్న టీచర్ పై కనికరం చూపని తెలంగాణ సర్కారు


సెకండరీ గ్రేడ్ టీచర్ గా అంబర్ పేటలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న హెచ్. నీరజ తొమ్మిది నెలల గర్భవతి. సర్వేలో పాల్గొనాలని ఆమెకు ఆదేశాలు అందడంతో... ఏవీ కళాశాలలో జరుగుతున్న సర్వే శిక్షణ తరగతులకు హాజరై తాను తొమ్మిది నెలల గర్భిణినని... 19 న జరిగే సర్వేలో పాల్గొనలేనని అధికారులకు మొరపెట్టుకుంది. అయినప్పటికీ... సర్వే నుంచి మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని ఆమెకు అధికారులు తేల్చి చెప్పారు. తన పరిస్థితిని మానవీయకోణంలో కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని నీరజ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News