: గ్రేటర్ హైదరాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి సిబ్బంది కరవు


గ్రేటర్ హైదరాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి తగిన సంఖ్యలో ఎన్యూమరేటర్లు( సర్వే చేసే ఉద్యోగులు) లేరు. సిబ్బంది కొరతను అధిగమించడానికి ఉన్న ఉద్యోగులకే అదనపు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా సర్వే కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులతో పాటు... ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను, సైన్యాన్ని, కేంద్రప్రభుత్వ ఉద్యోగులను కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. వీరిని కూడా లెక్కలోకి తీసుకుని ప్రతీ ఎన్యూమరేటర్ 25 నుంచి 28 గృహాలు సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా వారు సర్వేలో పాల్గొనడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులతోనే సర్వేని పూర్తిచేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. సిబ్బంది కొరతను అధిగమించడానికి ఉన్నవారిచేతే ఎక్కువ పనిచేయించాలని సర్కార్ నిర్ణయించుకుంది.ఈ నేపధ్యంలో, ప్రతీ ఎన్యూమరేటర్ చేత 70 ఇళ్లను సర్వే చేయించాలని టీఎస్ సర్కార్ భావిస్తోంది. అయితే ఈ సంఖ్య చాలా ఎక్కువని... దీంతో తమ మీద పనిభారం ఎక్కువై సరైన సమాచారం రాదేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News