: సెలెక్ట్ కమిటీకి బీమా బిల్లు


దేశీయ బీమా రంగంలోకి 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించేందుకు ఉద్దేశించిన ఇన్సూరెన్స్ బిల్లు, సెలెక్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లక తప్పలేదు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావడంతో పాటు బిల్లులో పలు సవరణలకు పట్టుబట్టాయి. దీంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం సాధించాలన్న మోడీ సర్కారు కల నెరవేరలేదు. సెలెక్ట్ కమిటీ ఈ బిల్లును పరిశీలించి ఆరు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. ఆ తర్వాతే ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు వీలుంటుంది. గురువారం రాజ్యసభ ముందుకు వచ్చే ఈ బిల్లు నేరుగా సెలెక్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే, కనీసం సెలెక్ట్ కమిటీ చైర్మన్ పదవినైనా తమకు కేటాయించాలన్న కాంగ్రెస్ డిమాండ్ ను మోడీ సర్కారు తోసిపుచ్చింది. తమ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఆనంద్ శర్మకు ఈ పదవి ఇవ్వాలన్న కాంగ్రెస్ వినతిని తిరస్కరించిన కేంద్రం, అధికార పార్టీకి చెందిన చందన్ మిత్రాకు దానిని కట్టబెట్టింది.

  • Loading...

More Telugu News