: సినీనటుడు మాదాల రవిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే...!


ప్రేమ పేరుతో... ఓ యువతిని వేధిస్తున్న కేసులో ప్రముఖ సినీ నటుడు మాదాల రవిని నిన్న సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... మాదాల రవి వివాహితుడు. తన బంధువు అయిన ఓ అమ్మాయితో కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నాడు. స్నేహం నటిస్తూనే... ఆ అమ్మాయికి ఓ రోజు ఆయన లవ్ ప్రపోజ్ చేశాడు. అయితే ఆ యువతి మాదాల రవి ప్రేమను నిరాకరించింది. ఆ తర్వాత ఆ యువతికి వేరొక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. దీంతో యువతి మీద కక్ష పెంచుకున్న రవి... పెళ్లిని చెడగొట్టేందుకు మార్ఫ్ చేసిన ఆ అమ్మాయి ఫోటోలను... ఆమెకు కాబోయే వరుడికి పంపించాడు. తనకు, ఆ అమ్మాయికి 'రిలేషన్' ఉందని నమ్మే విధంగా ఆ ఫొటోలను మాదాల రవి మార్ఫ్ చేశాడు. దీంతో, మగపెళ్లివారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. పెళ్లి క్యాన్సిల్ అవడంతో... ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి మాదాల రవిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు బుధవారం మాదాల రవిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News