: పార్టీ నిర్వహణలో కేజ్రీవాల్ అసమర్థుడు: శాంతిభూషణ్


కేజ్రీవాల్ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీలో అసమ్మతి రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవలే ఆ పార్టీ నాయకుడు యోగీంద్ర యాదవ్ కేజ్రీవాల్ వ్యవహార శైలిపై విమర్శలు చేయగా... తాజాగా మరో సీనియర్ నాయకుడు శాంతి భూషణ్ ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన శాంతిభూషణ్ కేజ్రీవాల్ పై నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ గొప్ప నాయకుడు...ప్రచార కర్తే కానీ, పార్టీ నిర్వహణలో ఆయనకు సమర్థత కొరవడిందని ఆయన ఆరోపించారు. పార్టీ పెట్టి రెండేళ్లు అయినప్పటికీ...దేశవ్యాప్తంగా ఇప్పటికీ విస్తరించకపోవడం ప్రధాన కారణం పార్టీ నిర్వహణకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు కేజ్రీవాల్ లో లేకపోవడమేనని ఆయన అన్నారు. పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికైనా కేజ్రీవాల్ మరొకరికి అప్పగించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News