: కిషన్ రెడ్డిది తెలంగాణా? ఆంధ్రా?: నాయిని
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఈ రోజు బీజేపీ, టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు, వారి స్థానికత ఏంటి? అంటూ ప్రశ్నించారు. ఎన్జీవోలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డి పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. కిషన్ రెడ్డిది తెలంగాణానా? ఆంధ్రానా? అని ప్రశ్నించారు. హైదరాబాదుపై గవర్నరుకు అధికారం ఇస్తే ఒప్పుకునే ప్రశ్నేలేదని ఆయన స్పష్టం చేశారు.